Secunderabad: గురునానక్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ
Secunderabad: సికింద్రాబాద్ గురుద్వారా నుండి గురునానక్ 557వ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి, కళాకారులు కత్తి, బల్లెం, కర్ర విన్యాసాలతో ఆకట్టుకున్నారు.
Secunderabad: గురునానక్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ
సికింద్రాబాద్: గురు మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సిక్కు సమాజ్ సేవకులు అన్నారు.గురు నానక్ 557వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్ గురుద్వారా నుండి గురు మహారాజ్ భారీ ర్యాలీ నిర్వహించారు.
సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ మీదుగా క్లాక్ టవర్, ప్యాట్నీ, ఆర్.పి. రోడ్డు, బాటా సర్కిల్, మోండా మార్కెట్ మీదుగా పాలికా బజార్ గురుద్వారా చేరుకుంది.
సిక్కు సమాజ్ కళాకారులు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకునే విధంగా కత్తి బల్లెం కర్ర తోపాటు పలు విన్యాసాలు చేశారు.




