Secunderabad: కార్తీక మాసం ప్రారంభం.. సికింద్రాబాద్ శివాలయాల్లో భక్తుల రద్దీ!
Secunderabad: కార్తీక మాసం ప్రారంభం కావడంతో సికింద్రాబాద్ బోయిన్పల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, దీపారాధన చేసిన జనం.
Secunderabad: కార్తీక మాసం ప్రారంభం.. సికింద్రాబాద్ శివాలయాల్లో భక్తుల రద్దీ!
Secunderabad: సికింద్రాబాద్ కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెల్లవారుజాము నుండే శివాలయాలకు భక్తులు బారులు తీరారు.బోయిన్పల్లిలోని భవన్ ఇంక్లేవ్ గణపతి దేవాలయం అనుసంధాన శివాలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పండితులు ఉదయం నుండి స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక అలంకరణలు చేశారు.పవిత్రమైన కార్తీక మాసంలో స్వామివారికి చేసే అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు ఎంతో ప్రీతికరమని భక్తులు విశ్వసిస్తారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని, స్వామివారిని దర్శించుకుని, దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా కార్తీక దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.




