Secunderabad: కంటోన్మెంట్ పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్ల పంపిణీ!
Secunderabad: ఎంపీ ఈటల రాజేందర్ సూచనతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని 1000 మంది పారిశుద్ధ్య కార్మికులకు బానుక నర్మద మల్లిఖార్జున్ దీపావళి స్వీట్లను పంపిణీ చేశారు.
Secunderabad: కంటోన్మెంట్ పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్ల పంపిణీ!
సికింద్రాబాద్: దీపావళి పండుగ సందర్భంగా కంటోన్మెంట్ పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్స్ పంపిణీ చేసిన బానుక నర్మద మల్లిఖార్జున్. దీపావళి పండుగను పురస్కరించుకుని, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ ఈటల రాజేందర్ గారి సూచన మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 1వ వార్డు నుండి 8వ వార్డు వరకు పనిచేస్తున్న సుమారు (1000)పారిశుద్ధ్య కార్మికులందరికీ ఈరోజు స్వీట్ బాక్సులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బానుక నర్మద మల్లిఖార్జున్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తూ, ఎండా వానలను సైతం లెక్కచేయకుండా తమ విధులను నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. దీపావళి పండుగ సంతోషాలను వారితో పంచుకోవాలనే సదుద్దేశంతో, ప్రతి ఒక్క కార్మికుడికి స్వీట్ బాక్స్ అందజేయడం జరిగిందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి, వారి కుటుంబాల సంతోషానికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 8 వార్డుల్లో బీజేపీ సినియర్ నాయకులు, కార్యకర్తల తోడ్పాటుతో ఘణంగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.




