Hyderabad: సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి

Hyderabad: సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కోరింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 30 Sept 2026 8:50 PM IST
Hyderabad
X

Hyderabad: సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి

హైదరాబాద్: సింగరేణి భవన్‌లో సింగరేణి అధికారులతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించింది. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణతో కలిసి సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఇతర అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు.

సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కమిషన్ కోరింది. ఫేస్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ కార్మికులను ప్రోత్సహించి, యాక్టింగ్ అవకాశాలు కల్పించాలని సూచించింది. అలాగే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరింది.

చిన్నచిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి డిస్మిస్ అయిన కార్మికుల సమస్యలను పరిశీలించి, అర్హత ఉన్న వారికి తిరిగి ఉద్యోగాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని కమిషన్ సూచించింది. అప్పిలేట్ అథారిటీలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని, యాక్టింగ్‌లో ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కరించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో సింగరేణి జీఎం ఐఆర్, జీఎం పీఎం, జీఎం వెల్ఫేర్, జీఎం ఈఈ సెల్, చీఫ్ ఎస్సీ, ఎస్టీ లైజనింగ్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.