Chevella: దళితుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలి..కాంగ్రెస్ ఇంచార్జి భీమ్ భరత్!

Chevella: దళితుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పిలుపు. అజీజ్‌నగర్‌లో నూతన ఎస్సీ విభాగం నేతలకు నియామక పత్రాల అందజేత.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 11 Oct 2026 1:22 PM IST
Chevella
X

Chevella: దళితుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలి..కాంగ్రెస్ ఇంచార్జి భీమ్ భరత్!

Chevella: ఈరోజు అజీజ్ నగర్ లో భీమ్ భరత్ , మరియు రంగారెడ్డి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మెన్, మండల, మున్సిపల్ ఎస్సీ విభాగం అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ మాట్లాడుతూ చేవెళ్ళ నియోజక వర్గంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజా పాలనలో, రైతులు, మహిళలు, యువత, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఎస్సీ విభాగం నేతలు విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు.

చేవెళ్ళ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు, దళితుల అభివృధి కోసం కృషి చేయాలి అని నూతనంగా ఎన్నికైన ఎస్సీ విభాగం నేతలకు భీమ్ భరత్ సూచించారు.

చేవెళ్ళ నియోజక వర్గం ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ కమిటీ చైర్మన్ లు

చేవెళ్ళ నియోజక వర్గం ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ - బేగరి సుశాంత్

రంగా రెడ్డి జిల్లా ఎస్ సి సెల్ వైస్ ప్రెసిడెంట్ అంతారం నర్సింలు

చేవెళ్ళ నియోజక వర్గం ఎస్ సి సెల్ వైస్ ప్రెసిడెంట్ - కనగళ్ళ రాజు

చేవెళ్ళ నియోజక వర్గం ఎస్ సి సెల్ వైస్ ప్రెసిడెంట్- అనిల్ కుమార్

చేవెళ్ళ నియోజక వర్గం ఎస్ సి సెల్ వైస్ ప్రెసిడెంట్- పెంటాల సాయిలు

చేవెళ్ళ నియోజక వర్గం ఎస్ సి సెల్ జెనరల్ సెక్రెటరీ - పడాల జనార్దన్

చేవెళ్ళ నియోజక వర్గం ఎస్ సి సెల్ జెనరల్ సెక్రెటరీ- చొక్కంపేట రామస్వామి

చేవెళ్ళ మండలం ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ - గణపురం రాములు

చేవెళ్ళ మున్సిపల్ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ - పోతురాజు నవీన్

షాబాద్ మండలం ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ - తొంట రాములు

శంకర్ పల్లి మండలం ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ - పాల్గుట్ట నర్సింలు

శంకర్ పల్లి మున్సిపల్ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ - కుంటి దేవయ్య

నవాబ్ పేట మండల ఎస్ సి ప్రెసిడెంట్ - డి నర్సింలు

మొయినాబాద్ మండలం ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ - ఎం దాస్

మొయినాబాద్ మున్సిపల్ ఎస్ సి ఎస్ ప్రెసిడెంట్ - పుల్లగల్ల కుమార్ లకు నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా చేవెళ్ళ కాంగ్రేస్ పార్టీ ఎస్సి విభాగం చైర్మెన్ , మండల ,మున్సిపల్ ఎస్సీ విభాగం అధ్యక్షులు గా అవకాశం కల్పించిన భీమ్ భరత్,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ , జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మెన్ క్యారగారి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీ పి సి సి కార్యదర్శులు రామ్ రెడ్డి, షాబాద్ మండల అధ్యక్షులు పెంట రెడ్డి, మొయినాబాద్ మండల అధ్యక్షులు సత్య నారాయణ, మొయినాబాద్ మండలం మాజీ అధ్యక్షులు మానయ్య, షాబాద్ మాజీ సర్పంచ్ రవీందర్ గల్, షాబాద్ సర్పంచ్ అశోక్ , జిల్లా వైస్ ప్రెసిడెంట్ పడాల రాములు , జిల్లా సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి, మన్మర్రి మాజీ సర్పంచ్ సత్యం, మొయినాబాద్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి ,

గన్నెపాగ నర్సింగ్ రావు , విఠల్ యాదవ్ , బిక్షపతి , డైరెక్టర్ బాల కృష్ణ రెడ్డి, బద్దం కృష్ణ రెడ్డి, శంకర్ పల్లి మండల వైస్ ప్రెసిడెంట్ నసీరుద్దీన్ , డైరెక్టర్ రవీందర్ రెడ్డి , గణపురం ప్రసాద్ , సంజయ్ , దయానంద్ గౌడ్ , చంద్రశేఖర్ , శశి కిరణ్ , నవీన్ ,గూడూరు శ్రీను మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేవెళ్ళ నియోజక వర్గం ఎస్సీ విభాగం నాయకులు, అన్ని మండలాల ఈ ఎస్సీ విభాగం నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA