Madugula: రామదుగ్యాల గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి!
Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రామదుగ్యాల గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు.
Madugula: రామదుగ్యాల గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి!
Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రామదుగ్యాల గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక సర్పంచ్ తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు వినతిని అందజేసి, ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సూదిని పురుషోత్తంరెడ్డి, వార్డు సభ్యులు భాస్కర్, రవి, బి. విజయ, ఈదయ్యతో పాటు కార్యకర్తలు బి. మోహన్, బి. గణేష్, ఈ. భూపేష్, ఈ. రమేష్, వి. మహేష్, బి. ప్రకాష్, ఎస్. విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




