Talakondapally: సొంతింటి నిర్మాణంలో సిమెంట్ అందజేసి అండగా నిలిచిన సర్పంచ్

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లిలో నిరుపేద కుటుంబానికి ఇంటి నిర్మాణానికి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి సిమెంట్ అందజేసి అండగా నిలిచారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 30 Sept 2026 4:06 PM IST
Talakondapally
X

Talakondapally: సొంతింటి నిర్మాణంలో సిమెంట్ అందజేసి అండగా నిలిచిన సర్పంచ్

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని లింగరావుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో నిలిచిపోయింది.

విషయం తెలుసుకున్న లింగరావుపల్లి గ్రామ సర్పంచ్, తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి స్పందించి కుటుంబాన్ని పరామర్శించారు.

ఇంటి నిర్మాణం కొనసాగించేందుకు అవసరమైన సిమెంట్‌ను అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు. ఆపద సమయంలో సహాయం అందించిన సర్పంచ్‌కు రాజమౌని శేఖర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న కాసు శ్రీనివాస్ రెడ్డి సేవలను గ్రామస్థులు అభినందించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY