Amanagallu: శెట్టిపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత పరిష్కారానికి విజ్ఞప్తి!
Amanagallu: ఆమనగల్ మండలం శెట్టిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేసిన సర్పంచ్ జంగమ్మ వెంకటయ్య.
Amanagallu: శెట్టిపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత పరిష్కారానికి విజ్ఞప్తి!
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరత సమస్యపై గ్రామ సర్పంచ్ జంగమ్మ వెంకటయ్య చొరవ తీసుకున్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ గురువారం జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారిని కలిసి సమస్యను వివరించారు.
పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి, పాఠశాలకు అవసరమైన బోధనా సిబ్బందిని నియమించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడి విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందేలా అవసరమైన సహకారం అందించాలని సర్పంచ్ పేర్కొన్నారు.




