Allapur: అల్లాపూర్ డివిజన్‌లో వినూత్నంగా, ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
Allapur: కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్‌లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎ. లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
Allapur: అల్లాపూర్ డివిజన్‌లో వినూత్నంగా, ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
అల్లాపూర్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎ. లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు సైతం వేడుకల్లో పాల్గొని బతుకమ్మతో పాటు దాండియా ఆడి పాడారు.కులమతాలకు అతీతంగా అందరూ కలిసి వేడుకల్లో పాల్గొనడంతో అల్లాపూర్ డివిజన్‌లో పండుగ సందడి నెలకొంది. మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ, ఐక్యత మరియు సోదరభావానికి ఈ వేడుకలు ప్రతీకగా నిలిచాయి.




