Girmapur: గిర్మాపూర్ బ్రిడ్జికి రూ. 7.40 కోట్ల నిధులు మంజూరు

Girmapur: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చొరవతో మేడ్చల్ జిల్లా గిర్మాపూర్ సరిహద్దు బ్రిడ్జి నిర్మాణానికి రూ.7.40 కోట్లు మంజూరు కాగా హెచ్‌ఎండీఏ సర్వే ప్రారంభించింది.

NAKSHATRAM, MEDCHAL
Published on: 26 Oct 2026 2:53 PM IST
Girmapur
X

Girmapur: గిర్మాపూర్ బ్రిడ్జికి రూ. 7.40 కోట్ల నిధులు మంజూరు

మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లాలో రైలాపూర్ నుంచి గౌడవెల్లి వెళ్లే రహదారిలో గిర్మాపూర్ సరిహద్దు వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడింది.

ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారి చొరవతో ఇటీవల రూ.7 కోట్ల 40 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి ఆశలు చిగురించాయి.

ఈ నేపథ్యంలో, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఈరోజు హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేందుకు వచ్చారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ సర్వే ప్రక్రియను ప్రారంభించారు.

బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక పరిశీలనలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించారు. నిధులు మంజూరు కావడంతో పాటు అధికారులు సర్వే చేపట్టడం ద్వారా నిర్మాణ పనులకు సంబంధించి తదుపరి చర్యలకు మార్గం సుగమమవుతోంది.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL