Jubilee Hills: బోరబండ బాధితుడి వైద్య చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు!

Jubilee Hills: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ వాసి డి. సుబ్రహ్మణ్యం రాజు నిమ్స్ ఆసుపత్రి వైద్య చికిత్సకు ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ విజ్ఞప్తితో సీఎం రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 13 Nov 2026 7:26 PM IST
Jubilee Hills
X

Jubilee Hills: బోరబండ బాధితుడి వైద్య చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు!

జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ, అనంతయ్య బస్తీ, ఇందిరానగర్‌కు చెందిన డి. సుబ్రహ్మణ్యం రాజు వైద్య చికిత్స నిమిత్తం (LOC ) ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది.

అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయగా, ఎమ్మెల్యే గారి అభ్యర్థనపై స్పందించిన ముఖ్యమంత్రి గారు రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీ (LOC) మంజూరు చేశారు. ఈ ఆర్థిక సాయంతో బాధితుడికి నిమ్స్ ఆసుపత్రిలో అవసరమైన వైద్య చికిత్స అందించనున్నారు.

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, మెరుగైన వైద్యం అందించేందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE