Pargi: పరిగిలో రోడ్డు మరమ్మతు పనులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందుల నుంచి ఊరట!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి కోర్టు మార్గంలో మిషన్ భగీరథ లీకేజీతో దెబ్బతిన్న రోడ్డుకు మున్సిపల్ సీసీ ప్యాచ్‌వర్క్ పనులు. పనులను పరిశీలించిన చైర్మన్ రజిత వెంకటేష్.

WAZID, PARIGI
Published on: 6 Nov 2026 5:39 PM IST
Pargi
X

Pargi: పరిగిలో రోడ్డు మరమ్మతు పనులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందుల నుంచి ఊరట!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కోర్టు నుంచి వికారాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను గుర్తించిన మున్సిపల్ అధికారులు రహదారి ఎక్కడెక్కడ దెబ్బతిన్నదో ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్డుతో ప్యాచ్‌వర్క్ పనులు చేపట్టారు. దీంతో వాహనదారులకు కొంత ఊరట లభించనుంది.ఈ సందర్భంగా రహదారి మరమ్మతు పనులను పరిగి మున్సిపల్ చైర్మన్ కుడుముల రజిత వెంకటేష్, నాయకులు కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కుడుముల రజిత వెంకటేష్ మాట్లాడుతూ.. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హయాంలో పరిగి పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడంతో పాటు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్థసారథి పంతులు, పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్ హనుమంతు, పరిగి టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణ రెడ్డి, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI