Kukatpally: గోద్రెజ్ ప్రాపర్టీస్ బ్లాస్టింగ్ పనులపై గేటెడ్ కమ్యూనిటీ వాసుల ధర్నా!
Kukatpally: కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ పనుల బ్లాస్టింగ్‌పై గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఆందోళన చేపట్టారు.
Kukatpally: గోద్రెజ్ ప్రాపర్టీస్ బ్లాస్టింగ్ పనులపై గేటెడ్ కమ్యూనిటీ వాసుల ధర్నా!
Kukatpally: కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ సంస్థ ఎదుట స్థానిక గేటెడ్ కమ్యూనిటీల వాసులు ధర్నా నిర్వహించారు. నిర్మాణ పనుల్లో చేపడుతున్న బ్లాస్టింగ్‌తో శబ్ద కాలుష్యం, దుమ్ము, ధూళి, భవనాలకు వైబ్రేషన్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళల్లో బ్లాస్టింగ్ చేయడంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇండస్ వన్ సిటీ, లోధా మెరిడియన్, బెలేజా అపార్ట్‌మెంట్లకు చెందిన సుమారు 5 వేల కుటుంబాలు ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్లాస్టింగ్ ప్రభావంపై నిర్వహించిన సిస్మోగ్రాఫ్ పరీక్షల్లో పరిమితులకు మించిన ప్రకంపనలు నమోదైనట్లు నివాసితులు వెల్లడించారు. నిర్మాణ సంస్థ భద్రతా ప్రమాణాలు పాటించేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గేటెడ్ కమ్యూనిటీల నివాస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.




