Jawaharnagar: డంపింగ్ యార్డు తొలగించకుంటే సీఎం కుర్చీ దించుతాం: బాలుడి హెచ్చరిక!

Jawaharnagar: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తొలగించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్ష 8వ రోజుకు చేరింది. యార్డు తీయకుంటే సీఎం కుర్చీ దించుతామని బాలుడు విశ్వజీత్ హెచ్చరించాడు.

PURENDAR, ALWAL
Published on: 29 Nov 2026 5:10 PM IST
Jawaharnagar
X

Jawaharnagar: డంపింగ్ యార్డు తొలగించకుంటే సీఎం కుర్చీ దించుతాం: బాలుడి హెచ్చరిక!

జవహర్‌నగర్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలింపు ఉద్యమం ఉధృతమవుతోంది. యార్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం ఎనిమిదో రోజుకు చేరింది. ఈ పోరాటంలో పదేళ్ల బాలుడు భాషిపాక విశ్వజీత్ చేసిన హెచ్చరిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దీక్షలో పాల్గొన్న విశ్వజీత్ మాట్లాడుతూ.. ‘‘రేవంత్ రెడ్డి తాతయ్య.. మా ప్రాంత ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడొద్దు. డంపింగ్ యార్డును వెంటనే తొలగించండి. లేకపోతే మేమంతా కలిసి మిమ్మల్ని సీఎం కుర్చీ నుంచి దించుతాం’’ అంటూ ఘాటుగా హెచ్చరించాడు. డంపింగ్ యార్డు దుర్వాసన, కాలుష్యంతో చిన్నారులు సైతం అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్ల తరబడి ప్రజలు నరకం అనుభవిస్తున్నా పాలకులకు పట్టడం లేదని మండిపడ్డాడు.

ప్రజల ప్రాణాల కంటే డంపింగ్ యార్డే ముఖ్యమా ? అని ప్రశ్నిస్తూ, తమ భవిష్యత్తును కాపాడేందుకు యార్డును తక్షణమే తరలించాలని విశ్వజీత్ డిమాండ్ చేశాడు. పదేళ్ల బాలుడి హెచ్చరిక దీక్షా శిబిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

దీక్షలో కూర్చున్న వారు: ఆంజనేయులు, సోమయ్య, రాజు, సునీత, నందిని, రజిత, గణేష్, సత్యనారాయణ, రవి, రాము, సుజ్జి, యమున గౌడ్, భాషిపాక విశ్వజీత్, భాషిపాక శ్రీకర్.

ఈ కార్యక్రమంలో డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావాలి, కొన్నే వేణు, యాదగిరి, శ్రీనివాస్, సురేందర్, జయసుధ, నర్సన్న, మల్లేష్, జయ, రాజానర్సింహా, నాగరాజు, రాజు, దర్గయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL