Boduppal: బోడుప్పల్‌లో తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ పర్యటన!

Boduppal: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఇందిరానగర్ కాలనీలో కాంగ్రెస్ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ పర్యటన. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కల సాకారం చేస్తామని వెల్లడి.

KARUNAKAR, UPPAL
Published on: 11 Nov 2026 12:13 PM IST
Boduppal
X

Boduppal: బోడుప్పల్‌లో తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ పర్యటన!

Boduppal: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ అన్నారు.

బుధవారం మల్కాజిగిరి నగర పాలక సంస్థ బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని బోడుప్పల్‌ డివిజన్‌ ఇందిరానగర్‌ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులను కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబానికి కూడు, గూడు కల్పించాలనే సంకల్పంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బోడుప్పల్‌ మాజీ అధ్యక్షుడు పోగుల నర్సింహారెడ్డి, బోడుప్పల్‌ డివిజన్‌ అధ్యక్షుడు బొమ్మకు కళ్యాణ్‌, కొత్త కిషోర్‌గౌడ్‌, రాములు, గుర్రాల వెంకటేశ్‌ యాదవ్‌, సత్యనారాయణ యాదవ్‌, చీరాల నరసింహ, దానగల యాదగిరి, వెంకటేశ్‌ గుప్తా, బొమ్మ రమేశ్‌, లోకేశ్‌, హరినాథ్‌రెడ్డి, కాలనీవాసులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL