Kadthal: సమిష్టి కృషితోనే గ్రామాల ప్రగతి: సర్పంచ్ బొప్పిడి గోపాల్!

Kadthal: సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి కడ్తాల్ మండలం రావిచేడ్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమిపూజ చేసిన జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు బొప్పిడి గోపాల్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Oct 2026 4:08 PM IST
Kadthal
X

Kadthal: సమిష్టి కృషితోనే గ్రామాల ప్రగతి: సర్పంచ్ బొప్పిడి గోపాల్!

కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సమిష్టి కృషితోన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ అన్నారు. కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలోని 8వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మంజూల యాదయ్య, రవికుమార్, హనుమంతు నాయక్, రమేష్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్, బీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, నాయకులు బాలకృష్ణ, పాండు, గోపాల్ రెడ్డి, రాములు యాదవ్, నర్సింహా, సురేష్, శ్రావణ్, సాయికుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి నాయక్, సిబ్బంది తదితరులున్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY