Pargi: పరిగిలో కారు టాప్‌పై కూర్చొని రాష్ డ్రైవింగ్ వీడియో వైరల్
Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో కారు టాప్‌పై కూర్చొని రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించిన ఘటన కలకలం రేపింది.
Pargi: పరిగిలో కారు టాప్‌పై కూర్చొని రాష్ డ్రైవింగ్ వీడియో వైరల్
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కొందరు వ్యక్తులు కారు టాప్‌పై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.కారులో ప్రయాణించాల్సిన వ్యక్తులు కారు టాప్‌పై కూర్చొని రాష్ డ్రైవింగ్ చేస్తుండటంతో అటుగా వెళ్తున్న పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి నిర్లక్ష్యపు ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు ఏర్పడతాయని వాహనదారులు అంటున్నారు.రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత పోలీస్ అధికారులు స్పందించి, ఇలాంటి ప్రమాదకర డ్రైవింగ్‌కు అడ్డుకట్ట వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




