Pargi: పరిగిలో అరుదైన వైద్య ఘటన.. యువకుడి శరీరంలో గర్భాశయం గుర్తింపు!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలోని ఛత్రజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో 17 ఏళ్ల యువకుడి శరీరంలో ఉన్న గర్భాశయాన్ని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
Pargi: పరిగిలో అరుదైన వైద్య ఘటన.. యువకుడి శరీరంలో గర్భాశయం గుర్తింపు!
పరిగి: పరిగి వైద్యరంగంలోనే అత్యంత అరుదుగా కనిపించే ఓ వైద్య ఘటన పరిగిలో వెలుగుచూసింది. పురుషుడి శరీరంలో గర్భాశయం వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవం ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల గణేష్ అనే యువకుడు కడుపునొప్పి, కుడివైపు గజ్జ ప్రాంతంలో నొప్పి, వృషణ సంచిలో వాపుతో పరిగిలోని ఛత్రజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఆశ్రయించాడు.గతంలో పదేళ్ల వయసులో వృషణం కిందకు దిగకపోవడంతో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ, అప్పట్లో వృషణం గుర్తించబడలేదు.
తాజాగా వైద్యులు మరింత లోతుగా పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స ద్వారా పరిశీలించగా.. పురుషుడి శరీరంలో ఉండకూడని గర్భాశయం వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవం ఉన్నట్లు గుర్తించారు.వైద్య పరిభాషలో దీనిని Persistent Müllerian Duct Syndrome (PMDS) అని పిలుస్తారు. ఇది అత్యంత అరుదైన జన్యుపరమైన పరిస్థితి. పురుషుడి శారీరక లక్షణాలు ఉన్నప్




