Talkondapally: దేవుని పడకల్‌లో రేపు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన

Talkondapally: తలకొండపల్లి మండలం దేవుని పడకల్‌లో శుక్రవారం మహాధార రైతు సంఘం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Nov 2026 9:16 PM IST
Talkondapally
X

Talkondapally: దేవుని పడకల్‌లో రేపు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామంలో ఈనెల 20న శుక్రవారం రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పడకల్ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

మహాధార రైతు ఉత్పత్తిదారుల సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించనున్న రైతు సౌకర్య కేంద్రం, అడ్మిన్ బ్లాక్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్, కార్యాలయాలు, సిబ్బంది వసతి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు.

ఉదయం 9.30 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొననున్నారు. రైతులకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY