Talakondapally: నీలకంఠం విష్ణు చిత్రపటానికి అమర్ లింగన్న ఘన నివాళులు!

Talakondapally: తలకొండపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు నీలకంఠం పాండు సోదరుడు నీలకంఠం విష్ణు దశదినకర్మకు ధర్మ జాగరణ క్షేత్ర ప్రముఖ్ అమర్ లింగన్న హాజరై నివాళులర్పించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Nov 2026 8:37 AM IST
Talakondapally
X

Talakondapally: నీలకంఠం విష్ణు చిత్రపటానికి అమర్ లింగన్న ఘన నివాళులు!

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు నీలకంఠం పాండు సోదరుడు నీలకంఠం విష్ణు దశదినకర్మ కార్యక్రమాన్ని గురువారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మ జాగరణ క్షేత్ర ప్రముఖ్ అమర్ లింగన్న, రాము లు హాజరై నీలకంఠం విష్ణు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్న వయసులోనే విష్ణు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

వెంకటేష్ నాయక్‌కు పరామర్శ

అనంతరం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు విరిగి చికిత్స పొందుతున్న హర్యానాయక్ తండాకు చెందిన వార్డు సభ్యుడు, బీజేపీ యువ నాయకుడు వెంకటేష్ నాయక్‌ను వారు పరామర్శించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో వెంకట్రావ్ పేట సర్పంచ్ ఉమ్మడి మహేష్, గట్టు ఇప్పలపల్లి సర్పంచ్ చంద్రశేఖర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రమేష్, భాస్కర్, వినోద్, బీజేపీ నాయకులు ప్రసాద్, శేఖర్ రెడ్డి, కుమార్, హారికంత్, బీజేవైఎం నాయకుడు విజయ్, నీలకంఠం పాండు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY