Talakondapalli: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటయ్యకు పరామర్శ!

Talakondapalli: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ వార్డు సభ్యురాలు లక్ష్మమ్మ భర్త వెంకటయ్యను ఆసుపత్రిలో మాజీ ఎంపీపీ సి.ఎల్. శ్రీనివాస్ యాదవ్ పరామర్శించి రూ.4 వేల ఆర్థిక సాయం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Nov 2026 1:45 PM IST
Talakondapalli
X

Talakondapalli: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటయ్యకు పరామర్శ!

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామపంచాయతీ పదో వార్డు సభ్యురాలు మాస్కా లక్ష్మమ్మ భర్త మాస్కా వెంకటయ్య అనారోగ్యంతో మహబూబ్‌నగర్‌లోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ సి.ఎల్. శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి వెంకటయ్యను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటయ్య కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.4,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

వెంకటయ్య త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యుడు ముజీబ్ రెహమాన్, వెల్జాల్ డిప్యూటీ సర్పంచ్ శివ, విజయలక్ష్మి, విజయ్ కుమార్, మూడో వార్డు సభ్యుడు వట్టెల శేఖర్ యాదవ్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY