Amanagallu: బాధిత కుటుంబాలను పరామర్శించిన పాపిశెట్టి రాము

Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రముఖ సంఘసేవకులు పాపిశెట్టి రాము పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 14 Nov 2026 11:11 PM IST
Amanagallu
X

Amanagallu: బాధిత కుటుంబాలను పరామర్శించిన పాపిశెట్టి రాము

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అని ప్రముఖ సంఘసేవకులు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు పాపిశెట్టి రాము అన్నారు.

ఆమనగల్లు మండల పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన గంగాపురం సంజీవ, ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన కొట్ర ఆనంద్ శనివారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన వారి కుటుంబాలను పరామర్శించారు. మృతుల పార్థివ దేహాలపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పాపిశెట్టి రాము మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట రామన్న మిత్రమండలి సభ్యులు శ్రీను నాయక్, పూసల భాస్కర్ తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY