Amanagal: బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రూ.20 వేల ఆర్థిక సాయం

Amanagal: ఆమనగల్లు ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు ఆనంద్ మృతి; హైదరాబాద్ నివాసంలో కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల సాయం అందజేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Nov 2026 5:21 PM IST
Amanagal
X

Amanagal: బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రూ.20 వేల ఆర్థిక సాయం

ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం కాంట్రాక్టర్ మల్లారెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు శేఖర్, మహేష్‌లకు ఎమ్మెల్యే అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా, మాజీ యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ శీను నాయక్, మండల వైస్ ప్రెసిడెంట్ సురేష్ నాయక్, శివ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY