Kadthal: నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలే కీలకం: సర్పంచ్ బిక్షపతి!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో సర్పంచ్ రాయికంటి బిక్షపతి ఇంకుడు గుంత పనులను ప్రారంభించారు. నిర్మాణానికి ప్రభుత్వం రూ.6,500 ఆర్థిక సాయం ఇస్తుందని తెలిపారు.
Kadthal: నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలే కీలకం: సర్పంచ్ బిక్షపతి!
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో వర్షపు నీటితో పాటు ఇంట్లో వినియోగించిన నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని కడ్తాల్ గ్రామ సర్పంచ్ రాయికంటి బిక్షపతి గ్రామ ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు సహకరించాలని పిలుపునిచ్చారు.
వీబీ-జీ రామ్-జీ పథకంలో భాగంగా సోమవారం సర్పంచ్ రాయికంటి బిక్షపతి తన ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంకుడు గుంతలు నిర్మించుకునే వారికి ప్రభుత్వం నుంచి రూ.6,500 ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. గ్రామంలో నీటి వనరులను కాపాడుకోవడం, భూగర్భ జలమట్టాన్ని పెంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎర్రోళ్ల రాఘవేందర్, జహంగీర్ బాబా, ముత్తి కృష్ణ, కొప్పు వసంత, భాను కిరణ్, కర్రోళ్ల రమేష్, చేగురు మహేష్, నాగిళ్ల మల్లయ్య, విజయ్, పంచాయతీ కార్యదర్శి అల్లాజీ, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




