Kadthal: కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి: మహేష్ యాదవ్!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకుడు జెనిగల మహేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Nov 2026 9:42 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి: మహేష్ యాదవ్!

కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు జెనిగల మహేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రైతులు వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని తెలిపారు. కడ్తాల్ మండలంలోని వ్యవసాయ పరిస్థితులను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందించడంతో పాటు పంట రుణాల విషయంలో ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY