Hyderabad: ఎల్బీనగర్‌లో ఏసీబీ పంజా: రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి అరెస్ట్!

Hyderabad: ఎల్బీనగర్‌లో ఫిజియోథెరపీ సెంటర్ రీ-ఓపెన్‌కు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసిన కేసులో రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, సహాయకుడిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

TELANGANA BUREAU
Published on: 5 Oct 2026 5:54 PM IST
Hyderabad
X

Hyderabad: ఎల్బీనగర్‌లో ఏసీబీ పంజా: రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి అరెస్ట్!

హైదరాబాద్: LB నగర్‌లోని ఓ ఫిజియోథెరపీ సెంటర్‌ను రీ-ఓపెన్ చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై DMHO స్వర్ణకుమారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి నుంచి LB నగర్ వద్ద రూ.1 లక్షను DMHO సహాయకుడు శ్రీనివాస్ తీసుకున్నట్లు సమాచారం.

డబ్బులు అందిన విషయాన్ని శ్రీనివాస్ DMHOకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న DMHOను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని శివరాంపల్లిలోని కార్యాలయానికి తరలించారు.

DMHO స్వర్ణకుమారితో పాటు శ్రీనివాస్, అతని ప్రైవేట్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ DSP శ్రీధర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.

TELANGANA BUREAU

TELANGANA BUREAU