Kadtal: కడ్తాల్‌లో ఘనంగా గూడూరు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Kadtal: రంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కడ్తాల్‌లో ఘనంగా నిర్వహణ.
Kadtal: కడ్తాల్‌లో ఘనంగా గూడూరు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు!
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను కడ్తాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతుగంటి శంకర్, పట్టణ అధ్యక్షులు మాలే మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
అంతకుముందు గూడూరు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు..ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే యూత్ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గూడూరు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా బలోపేతం కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తనవంతు కీలక పాత్ర పోషించారని తెలిపారు.
కడ్తాల్ పట్టణానికి వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పనిచేస్తూ ప్రజలకు విశేష సేవలందించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కృషి చేశారని గుర్తుచేశారు. కడ్తాల్ గ్రామాన్ని రంగారెడ్డి జిల్లాలో కలపడంతో పాటు కడ్తాల్‌ను మండలంగా ఏర్పాటు చేయడంలోనూ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి అని కొనియాడారు. పార్టీ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం గూడూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తనపై ఉండాలని కోరారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ, సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బీచ్యా నాయక్, సత్యం యాదవ్, జహంగీర్ బాబా,
పిప్పళ్ల యాదయ్య, వడ్డే రాజు, రవి, మంకీ శ్రీను, భానుకిరణ్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, కల్వకుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షులు షాబుద్దీన్, ఎర్రోళ్ల శ్రీకాంత్, ప్రవీణ్ గౌడ్, గంజి చంద్రశేఖర్, భరత్ యాదవ్, బాలకృష్ణ, శ్రీకాంత్, మహేష్, కుమార్, సేవ్య, రామకృష్ణ, సందీప్, సత్యం, రమేష్, రఫీక్, నరేందర్, నరేష్, మణి, సురేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.




