Thalakondapally: లింగారావుపల్లిలో 20 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ

Thalakondapally: తలకొండపల్లి మండలం లింగారావుపల్లిలో 20 మందికి చేయూత పెన్షన్లు మంజూరయ్యాయి. సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 14 Nov 2026 11:19 PM IST
Thalakondapally
X

Thalakondapally: లింగారావుపల్లిలో 20 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగారావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా 20 మందికి చేయూత పెన్షన్లు మంజూరయ్యాయి. వీరిలో 14 మంది వితంతువులు, ఐదుగురు దివ్యాంగులు, ఒక ఒంటరి మహిళ ఉన్నారు.

నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లింగరావుపల్లి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి పెన్షన్ మంజూరు ఉత్తర్వులను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

చేయూత పెన్షన్లు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు. నూతనంగా పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY