Talakondapally: తలకొండపల్లిలో ఘనంగా బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ పాండు జన్మదిన వేడుకలు!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ పాండు జన్మదిన వేడుకలు.. పాల్గొన్న పార్టీ శ్రేణులు, నాయకులు.
Talakondapally: తలకొండపల్లిలో ఘనంగా బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ పాండు జన్మదిన వేడుకలు!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తలకొండపల్లి మండల అధ్యక్షుడు నీలకంఠ పాండు జన్మదిన వేడుకలను గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నీలకంఠ పాండుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నీలకంఠ పాండు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. తలకొండపల్లి మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నీలకంఠ పాండుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




