Shabad: బోడంపాడులో మహిళా రైతు దినోత్సవం: రైతులకు ఘన సన్మానం!
Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బోడంపాడులో అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Shabad: బోడంపాడులో మహిళా రైతు దినోత్సవం: రైతులకు ఘన సన్మానం!
షాబాద్, అక్టోబర్ 15, 2026: అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం – 2026 సందర్భంగా, “మహిళా రైతుల దినోత్సవం” కార్యక్రమాన్ని షాబాద్ మండలంలోని బోడంపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బోడంపాడు సర్పంచ్ సబ్బరిగారి కమలమ్మ చెన్నయ్య గారు, వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో మహిళా రైతులకు సన్మానం చేశారు, సర్పంచ్ గారు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళా రైతుల పాత్రను గుర్తించడం, వారి కృషిని గౌరవించడం, వ్యవసాయ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం, మహిళా రైతులు వ్యవసాయ రంగంలో అందిస్తున్న సేవలు, పంటల సాగులో వారి భాగస్వామ్యం, ఆహార భద్రత సాధనలో వారి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించడం జరిగింది.
మహిళా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ, శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించడం జరిగింది. అలాగే, మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర, వ్యవసాయంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడం, అందుబాటులో ఉన్న ప్రభుత్వ వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకోవడం, పంటల ఉత్పాదకతను పెంపొందించుకోవడం, స్థిరమైన వ్యవసాయ విధానాలను అనుసరించడం వంటి అంశాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించడం జరిగింది.
“మహిళలను సాధికారత దిశగా ముందుకు నడిపిస్తూ, వ్యవసాయ రంగాన్ని మరింత సమృద్ధిగా తీర్చిదిద్దుదాం” అనే సందేశంతో మహిళా రైతుల గౌరవం, సాధికారత, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఈవో మౌనిక, పంచాయతీ కార్యదర్శి స్నేహలత, మహిళా రైతులు రాధిక, కోట లక్ష్మీ, కారు సువర్ణ, కళ్ళెం చంద్రకళ తదితర మహిళా రైతులు, ఉప సర్పంచ్ కళ్ళెం శ్రీనివాస్, సుబ్బరిగారి చెన్నయ్య, కళ్ళెం ఆనంద్, కాకునూరి అశోక్, రాజు, గోళ్ళ నర్సింహులు, రఘుపతి రెడ్డి, వెంకటయ్య వ్యవసాయరంగం అభివృద్ధిలో మహిళా రైతుల పాత్ర కీలకమని, వారి కృషికి తగిన గుర్తింపు లభించినప్పుడే గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలియజేయడం జరిగింది.




