Madugula: మాడుగుల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి: వెంకటయ్య!
Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సుద్దపల్లి మాజీ ఎంపీటీసీ గ్యార వెంకటయ్య (చంటిబాబు) డిమాండ్ చేశారు.
Madugula: మాడుగుల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి: వెంకటయ్య!
మాడుగుల: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సుద్దపల్లి మాజీ ఎంపీటీసీ గ్యార వెంకటయ్య (చంటిబాబు) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో సుమారు 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, పంటలు సరిగా పండక పేద రైతులు, కౌలు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా దేవరకొండ, చింతపల్లి మండలాలతో పాటు నాగర్కర్నూల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినప్పుడు మాడుగుల మండలాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. రైతుల పరిస్థితులను పరిశీలించి మాడుగుల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడంతో పాటు బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.




