Kadthal: స్వయంకృషితోనే యువత ఎదగాలి: గంప వెంకటేష్ గుప్తా!
Kadthal: కడ్తాల్లో నూతన దుకాణాలను ప్రారంభించిన డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా. యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి వైపు సాగాలన్నారు.
Kadthal: స్వయంకృషితోనే యువత ఎదగాలి: గంప వెంకటేష్ గుప్తా!
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం, చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు స్వయంకృషితోనే ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు.
కడ్తాల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీనరసింహ చికెన్ సెంటర్, అదేవిధంగా మక్తమాదారం గేటు వద్ద జనరల్ స్టోర్ ను గంప వెంకటేష్ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. నిరుద్యోగులు స్వయంకృషితో, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని అన్నారు. చిన్న వ్యాపారాలే రేపు పెద్ద సంస్థలుగా ఎదుగుతాయని, యువత ఆ దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు సేవ్య నాయక్, నరసింహ గౌడ్, ఉప సర్పంచ్ లు శ్రీనివాస్ గౌడ్, పాండు నాయక్, ఆమనగల్లు కౌన్సిలర్ ఎనుమల రమేష్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్, మాజీ ఎంపిటిసి చంద్రమౌళి, నాయకులు జహంగీర్ అలీ, మాజీ వార్డు సభ్యులు హెచ్ ఆర్ మహేష్, యూత్ వింగ్ అధ్యక్షుడు అంజి, రాములు యాదవ్, భీమ్లా నాయక్, శ్రీకాంత్ యాదవ్, జగదీష్ గౌడ్,
శ్రీకాంత్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, గొర్ల వంశీ, కిరణ్ గౌడ్, శేఖర్ గౌడ్, సుదర్శన్ యాదవ్, తిరుపతిరెడ్డి, సాయిబాబా చారి, రాయకంటి, సురేష్, గూడూరు జంగారెడ్డి, గూడూరు శేఖర్ రెడ్డి, రాములు గౌడ్, యాదయ్య గౌడ్, బాల్ రాజ్ , చెన్నకేశవ, అండే కార్ రమేష్, బాలకృష్ణ, వెంకటేష్ స్థానిక నాయకులు, వ్యాపారస్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




