Amanagallu: ఆమనగల్ మండలం పోలేపల్లి తండా బాధితునికి సీఎంఆర్‌ఎఫ్ చెక్ అందజేత!
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పోలేపల్లి మంగలకుంట తండా బాధితునికి రూ.20,000 సీఎంఆర్‌ఎఫ్ చెక్ అందజేత. గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ.
Amanagallu: ఆమనగల్ మండలం పోలేపల్లి తండా బాధితునికి సీఎంఆర్‌ఎఫ్ చెక్ అందజేత!
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం: పోలేపల్లి గ్రామ పరిధిలోని మంగల్ కుంట తండాకు చెందిన కేతావత్ లఖ్య నాయక్ కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందిన అనంతరం, సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.20,000 ఆర్థిక సాయం మంజూరైంది.
గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మంజూరైన రూ.20,000 సీఎంఆర్‌ఎఫ్ చెక్కును సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో బాలుడి తండ్రి లఖ్య నాయక్‌కు అందజేశారు.
కార్యక్రమంలో కల్వకుర్తి మండలం BRS పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, నల్లచెరువు మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




