Amanagallu: ట్రాఫిక్ నిబంధనలు మీరితే జరిమానా: సీఐ శంకరయ్య!
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యల నివారణకు పండ్ల వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు సీఐ శంకరయ్య కౌన్సెలింగ్ నిర్వహించి జరిమానాలపై హెచ్చరించారు.
Amanagallu: ట్రాఫిక్ నిబంధనలు మీరితే జరిమానా: సీఐ శంకరయ్య!
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మున్సిపాలిటీ పట్టణంలోని చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్యల నివారణ, ప్రజల భద్రతే లక్ష్యంగా ఆమనగల్లు ట్రాఫిక్ సీఐ శంకరయ్య పండ్ల వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జాతీయ రహదారిపై ఆక్రమణలు, అక్రమ పార్కింగ్ కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా రహదారి పక్కన పండ్ల వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు రోడ్డు వరకు గొడుగులు ఏర్పాటు చేసి, ఇతర సామగ్రితో ఆక్రమణలకు పాల్పడవద్దని పోలీసులు ఆదేశించారు. రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా గొడుగులు, ఇతర ఆక్రమణలను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.
అలాగే ఆటో డ్రైవర్లు జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ ఆటోలు నిలపకూడదని, నిర్ణీత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రహదారిపై వాహనాలు నిలిపితే కఠినంగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రహదారులను ఆక్రమణలకు దూరంగా ఉంచాలని, ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు సహకరించాలని ఆమనగల్లు ట్రాఫిక్ పోలీసులు కోరారు.




