Amanagallu: కొప్పు మైసయ్య మృతి పట్ల పాపిశెట్టి రాము సంతాపం!
Amanagallu: ఆమనగల్ మండలం చింతలపల్లికి చెందిన కొప్పు మైసయ్య మృతి పట్ల ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రాము సంతాపం తెలిపి, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
Amanagallu: కొప్పు మైసయ్య మృతి పట్ల పాపిశెట్టి రాము సంతాపం!
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం చింతలపల్లి గ్రామపంచాయతీకి చెందిన కొప్పు మైసయ్య గారు నిన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు పాపిశెట్టి రాము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మైసయ్య మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, మైసయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కొప్పు మైసయ్య మృతి గ్రామానికి తీరని లోటు. వారి కుటుంబానికి ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని శ్రీ పాపిశెట్టి రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




