Amanagal: ఎండిన పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు!

Amanagal: ఆమనగల్లును కరువు మండలంగా ప్రకటించడంతో 13 పంచాయతీల్లో అధికారులు పంట నష్టాన్ని లెక్కిస్తున్నారు. పోలేపల్లిలో సర్పంచ్ వెంకటయ్య స్వయంగా పొలాలను పరిశీలించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 3 Nov 2026 10:57 PM IST
Amanagal
X

Amanagal: ఎండిన పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు!

ఆమనగల్: ఆమనగల్ మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిన నేపథ్యంలో మండలంలోని 13 గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ అధికారులు పంట నష్టాల అంచనా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని రైతుల వ్యవసాయ పొలాలను సందర్శిస్తూ ఎండిపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం పోలేపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారిణి ప్రభావతి, గ్రామ సర్పంచ్ వెంకటయ్యతో కలిసి రైతు ఒగ్గు కృష్ణయ్యకు చెందిన పొలంలో ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. అలాగే సోమవారం నుంచి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పత్తి, కంది, వరి తదితర పంటలను పరిశీలిస్తున్నారు.

పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సర్పంచ్ వెంకటయ్య స్వయంగా వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రైతుల పొలాలను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవ పంట నష్టాన్ని నమోదు చేయాలని అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గండికోట రవి, కొడుకుని శ్రీశైలం, నరేష్, వ్యవసాయ అధికారిణి ప్రభావతి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY