Talakondapally: రాంపూర్‌లో ఘనంగా వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ల ప్రారంభం!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్లను సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్ ప్రారంభించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Oct 2026 3:31 PM IST
Talakondapally
X

Talakondapally: రాంపూర్‌లో ఘనంగా వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ల ప్రారంభం!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఈరోజు వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్లను గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల–శ్రీశైలం యాదవ్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సందడి చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. క్రీడలు యువత శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.

రాంపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు క్రీడారంగంలోనూ ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో క్రీడలకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, యువతకు అండగా ఉంటూ వారి ప్రతిభను వెలికితీసేందుకు సహకరిస్తామని అన్నారు.

వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ల ప్రారంభంతో గ్రామంలో క్రీడా వాతావరణం నెలకొంది. క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి టోర్నమెంట్ల నిర్వహణతో యువతలో ఐక్యత, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం పెంపొందుతాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సప్పిడి ఆంజనేయులు, వార్డు సభ్యులు: కాకి రాము, చంద్రకళ-సుధాకర్, తిక్కల జంగయ్య, చెరువు జనరల్ సెక్రెటరీ చిల్కం శేఖర్, డైరెక్టర్ తిక్కల మహేష్,మాజీ సర్పంచ్ D. యాదయ్య,మాజీ ఎంపిటిసి కటికల యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ యెన్నం మోహన్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు: మీసాల ఆంజనేయులు, వాలీబాల్ నిర్వాహకులు: బాలు, నందు,చింటూ, శివ, కబడ్డీ నిర్వాహకులు: శేఖర్, శివలింగం, నందు, శ్రీశైలం,సంతోష్, శ్రావణ్, చందు, రామకృష్ణ,గ్రామ పెద్దలు, యువకులు: రొయ్యల రమేష్, ముక్తాల మల్లేష్, రమేష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY