Thalakondapally: క్రీడా మైదానంలో డే లైట్లు.. సర్పంచ్ దంపతుల ప్రత్యేక చొరవ

Thalakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ ప్రాథమిక పాఠశాల వద్ద క్రీడాకారుల కోసం సర్పంచ్ వట్టెల నిర్మల–శ్రీశైలం యాదవ్ రూ.10 వేలతో డే లైట్లు ఏర్పాటు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 13 Oct 2026 10:19 PM IST
Thalakondapally
X

Thalakondapally: క్రీడా మైదానంలో డే లైట్లు.. సర్పంచ్ దంపతుల ప్రత్యేక చొరవ

రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం దసరా పండుగ సందర్భంగా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైల యాదవ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వద్ద క్రీడాకారులకు ఉపయోగపడేలా సుమారు రూ.10 వేల విలువైన డే లైట్స్ ఏర్పాటు చేయించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది యువకులు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారని, వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తే తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని సర్పంచ్ అభిప్రాయపడ్డారు. క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో డే లైట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామాభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదని, యువత అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

యువత క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ గ్రామంలో క్రీడలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని, యువత సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రాంపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారులకు ఉపయోగపడేలా డే లైట్స్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామ యువత ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల–శ్రీశైలం యాదవ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, చెరువు జనరల్ సెక్రటరీ చిలుకం శేఖర్, యువ నాయకులు రమేష్, శేఖర్, చింటూ, మహేష్, టీ. శివ, బాలు, ఎం. శివ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY