Talakondapally: రాంపూర్ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం

Talakondapally: తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీర్చిన సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్. కొత్త మోటార్ ఏర్పాటుతో పునరుద్ధరించిన నీటి సరఫరా.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Sept 2026 5:05 PM IST
Talakondapally
X

Talakondapally: రాంపూర్ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో గత వారం రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యకు గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల–శ్రీశైలం యాదవ్ చొరవతో పరిష్కారం లభించింది. గ్రామంలోని హైస్కూల్ ఎదురుగా ఉన్న బోరుబావి మోటార్ గత కొన్ని రోజులుగా మరమ్మతులకు గురైంది.

మోటార్‌ను పరిశీలించిన మెకానిక్ పాత మోటార్ ఇక పనిచేయదని చెప్పడంతో గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సర్పంచ్ గుర్తించారు. దీంతో సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొని కొత్త బోర్ మోటార్‌ను తెప్పించారు.

సోమవారం కొత్త మోటార్‌ను బోరుబావిలో ఏర్పాటు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య తీరడంతో గ్రామస్తులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి రవీందర్, వాటర్‌మెన్ కిష్టయ్య, గ్రామ యువ నాయకులు మహేష్, రొయ్యల రమేష్, కటికెల శ్రీకాంత్, మెకానిక్ సుక్కరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY