Hyderabad: చేయి విరిగిన ఆయమ్మ వెంకటమ్మకు రమా జ్యోతి ఆర్థిక సహాయం!
Hyderabad: ప్రమాదవశాత్తు చేయి విరిగిన బిలీఫ్ హాస్పిటల్ ఆయమ్మ వెంకటమ్మకు ఆర్థిక సహాయం అందించిన లీఫ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఎం. రమా జ్యోతి.
Hyderabad: చేయి విరిగిన ఆయమ్మ వెంకటమ్మకు రమా జ్యోతి ఆర్థిక సహాయం!
Hyderabad: బిలీఫ్ హాస్పిటల్‌లో ఆయమ్మగా పనిచేస్తున్న వెంకటమ్మ గారు ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె చేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న లీఫ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఎం. రమా జ్యోతి గారు మానవతా దృక్పథంతో స్పందించి, వెంకటమ్మ గారికి తగిన సహాయం అందించారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం నిజమైన మానవత్వానికి నిదర్శనం. పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమా జ్యోతి గారి సేవాభావం ఎంతో అభినందనీయం.




