Banjara Hills: రెయిన్‌బో హాస్పిటల్‌లో అరుదైన కాలేయ మార్పిడి విజయం
Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో 2.9 కిలోల బరువున్న 6 వారాల శిశువుకు అరుదైన జీవదాత కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు.
Banjara Hills: రెయిన్‌బో హాస్పిటల్‌లో అరుదైన కాలేయ మార్పిడి విజయం
Banjara Hills: బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో కేవలం 2.9 కిలోల బరువున్న ఆరు వారాల శిశువుకు అరుదైన జీవదాత కాలేయ మార్పిడి చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.
తీవ్రమైన కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న శిశువుకు తల్లి దానం చేసిన 62 గ్రాముల కాలేయ భాగాన్ని మార్పిడి చేశారు. దక్షిణ భారతదేశంలోనే ఇది అరుదైన చారిత్రాత్మక వైద్య ఘట్టమని వైద్యులు తెలిపారు. సంక్లిష్ట చికిత్స అనంతరం శిశువు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.




