Raidurgam: రాయదుర్గంలో నకిలీ ఐఫోన్ల విక్రయం ఉత్తరప్రదేశ్ కేటుగాడు అరెస్ట్
Raidurgam: రాయదుర్గంలో నకిలీ ఆపిల్ ఐఫోన్లు, వాచీలు, ఇయర్‌బడ్స్ విక్రయిస్తున్న యూపీకి చెందిన అల్తమాష్ అరెస్ట్. నకిలీ ఉత్పత్తులు స్వాధీనం, ప్రధాన నిందితుడి కోసం గాలింపు.
Raidurgam: రాయదుర్గంలో నకిలీ ఐఫోన్ల విక్రయం ఉత్తరప్రదేశ్ కేటుగాడు అరెస్ట్
రాయదుర్గం: రాయదుర్గంలో నకిలీ ఆపిల్ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్‌ను ఒరిజినల్ ఉత్పత్తులుగా నమ్మించి విక్రయిస్తున్న ఒక కేటుగాడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అల్తమాష్ (26) అనే వ్యక్తి నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో నివాసముంటూ ఈ అక్రమ దందా సాగిస్తున్నాడు.
పేరున్న ఆపిల్ బ్రాండ్‌కు చెందిన నకిలీ ఉత్పత్తులను తక్కువ ధరకు తెప్పించి, వాటిని ఒరిజినల్ పరికరాలుగా ప్రజలను నమ్మించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు రాయదుర్గం ప్రాంతంలో దాడి చేసి నిందితుడు అల్తమాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి 2 నకిలీ ఐఫోన్లు, 4 నకిలీ ఆపిల్ వాచీలు మరియు 7 నకిలీ ఇయర్‌బడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ప్రధాన నిందితుడు ఆవేష్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ప్రజలు గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నుండి తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసి మోసపోవద్దని రాయదుర్గం పోలీసులు విజ్ఞప్తి చేశారు.




