Madhapur: రేపు మాదాపూర్‌లో గిగ్ వర్కర్ల సభ.. రాహుల్ గాంధీ హాజరు!

Madhapur: మాదాపూర్ హైటెక్స్ సమీప మైదానంలో శనివారం జరగనున్న గిగ్ వర్కర్ల భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఏర్పాట్లను మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 13 Nov 2026 4:39 PM IST
Madhapur
X

Madhapur: రేపు మాదాపూర్‌లో గిగ్ వర్కర్ల సభ.. రాహుల్ గాంధీ హాజరు!

మాదాపూర్: మాదాపూర్ లోని హైటెక్స్ సమీపంలో వద్ద ఉన్న మైదానంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.సభా ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్షించారు.

సభకు ముందుగా మాదాపూర్ శిల్పకళా వేదిక నుండి హెచ్‌ఐసీసీ వరకు గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, సంక్షేమ భరోసా కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని మంత్రులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అమలు చేయనున్న పలు సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ ఈ వేదికపై నుండి ప్రారంభించనున్నారు. సభను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY