Malkajgiri: రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవు: ఈటల రాజేందర్

Malkajgiri: రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, ఈవీఎంలపై కాంగ్రెస్ అసత్యాలు చెబుతోందని ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ప్రెస్ మీట్‌లో విమర్శించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 1 Nov 2026 2:39 PM IST
Malkajgiri
X

Malkajgiri: రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవు: ఈటల రాజేందర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా (అర్బన్) కార్యాలయంలో నవంబర్ 02, 2026 తేదీన జరగబోయే "మహా పాదయాత్ర" పై మీడియా సమావేశం నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

ఈ మహా పాదయాత్రకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..

* రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన నాటకం ఆడుతున్నారు.

* భారతజాతి ఆత్మగౌరాన్ని, కీర్తిని విదేశాల్లో పలచన చేసే ప్రయత్నం చేస్తున్నారు.

* ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడులు చేస్తున్నారు.

* పార్లమెంట్ మీద, సుప్రీంకోర్టు మీద, ఎన్నికల కమిషన్ మీద దాడులు చేస్తున్నారు.

* స్పెషల్ ఇంటెన్షిప్ రివిజన్ 1952లో మొదలైంది.

* బిజెపి మొదలు పెట్టింది కాదు.

* చనిపోయిన వారిని, మైగ్రేట్ అయినవారిని, డూప్లికేట్ ఓట్లు తీసివేయాలా వద్దా ?

* 1952 నుంచి ఇప్పటివరకు 13 సార్లు SIR జరిగింది.

* 2002 తరువాత.. అంటే 24 ఏళ్ల తర్వాత SIR జారుతుంది.

* కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 8 లక్షల ఓట్లు ఉంటే.. మూడున్నర లక్షల ఓట్లు మాత్రమే పోలవుతున్నాయి.

* మల్కాజిగిరి పార్లమెంట్ లో 39 లక్షల ఓట్లు ఉంటే 50% మాత్రమే పోలింగ్ జరుగుతున్నాయి. కారణం ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో ఓట్లు ఉన్నాయి.

* బీహార్, యూపీ, తెలంగాణ వివిధ గ్రామాల్లో ఉన్నవారికి ఓట్లు ఉంటాయి.

* ఓట్ల సమయంలో వారు వారి గ్రామంలో ఓట్లు వేసుకుంటారు కాబట్టే హైదరాబాద్లో పోలింగ్ తక్కువవుతుంది.

* మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో 39 లక్షల్లో 13 లక్షల కోట్లు తీసేశారు. ఈ 13 లక్షల మైనారిటీలవి, ఎస్సీలవి కావు కదా ?

* 13 లక్షలు ఒకే కేటగిరి చెందిన వారివి తీసేసామని దుష్ప్రచారం చేస్తున్నారు.

* చనిపోయిన వారివి, అడ్రస్ చేంజ్ అయినవారు, వారి ప్రాంతాలను ఓట్లు ఉంచుకొని ఇక్కడ రద్దు చేసుకున్నవారు, డబుల్ ఓట్లు ఉన్నవారు, ఈ నాలుగు రకాల వారిని మాత్రమే తీసివేస్తున్నారు.

* ఈ ప్రక్రియ చేస్తున్న ఎన్నికల కమిషన్ను విమర్శిస్తున్నారు.

* ఈవీఎంలను తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీనే ట్యాంపరింగ్ చేస్తున్నారని నిసిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారంటేనే ప్రజలు అర్థం చేసుకోవాలి.

* ట్యాంపరింగ్ నిజమైతే అబ్కీ బార్ 400 పార్ అన్న భారతీయ జనతా పార్టీకి 340 సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి ?

* కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు, లజ్జ లేదు కాబట్టే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు.

* ట్యాంపరింగ్ నిజమే అయితే 2023 ఎన్నికల్లో తెలంగాణలో మీరు ఎలా గెలిచారు.

* కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో గెలిస్తే ఈవీఎం లు సరిగా పనిచేసినట్లా ?

* అకారణంగా బట్ట కాల్చి మీద వేసి ఎన్నికల కమిషన్ ప్రతిష్టను దిగజారిస్తున్నారు.

* సుప్రీం కోర్టును విమర్శించడం, పార్లమెంటు వ్యవస్థను కించపరచడం చేస్తున్నారు.

* ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థకి పట్టుకొమ్మలాంటి భారత దేశాన్ని ఆభాసపాలు చేయడం సరికాదు.

* కాక్రోచ్ జనతా పార్టీ పిల్లలు వేరువేరు దేశాలకు సంబంధించిన ఏజెంట్లుగా మాట్లాడుతున్నారు.

* బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఫ్రెంచ్, స్విట్జర్లాండ్ దేశాలను స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్తున్నారు.

* రాహుల్ గాంధీకి నాయకత్వం వహించే సత్తా లేదు.

* బయటి దేశాల ఫండింగ్ తో మీడియాను, సోషల్ మీడియాను, మేనేజ్ చేసి వారికి ఫండింగ్ చేసి 80 సంవత్సరాలుగా చెక్కు చిదరకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్చినం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

* కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు చూసి దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు.

* కాక్రోచ్ జనతా పార్టీ వారిని చూసి ఎయిర్ పోర్టు లో సామాన్య ప్రజలు చీ కొడుతున్నారు.

* దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది, అలజడులు జరిగే అవకాశం ఉంది, న్యాయవ్యవస్థ మీద అప నమ్మకం ఏర్పడుతుంది, ప్రశాంతమైన వాతావరణం దెబ్బతీస్తున్నారు అని ప్రజలు ఛీ కొడుతున్నారు.

* నిజమైన దేశభక్తులు, ప్రజాస్వామ్యవాదులు, మన ప్రజాస్వామ్యవ్యవస్థ వర్ధిల్లాలి అని కోరుకునే వారితో పార్టీలకు జండాలకు అతీతంగా.. మేధావులు, విద్యార్థులు, యువకులు, దేశభక్తులు ఎక్కడికి అక్కడ పెద్ద ఎత్తున పాదయాత్రలో ర్యాలీలో చేస్తున్నారు. ఆ పాదయాత్రలో భాగంగానే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎల్బీ స్టేడియం (నిజాం కాలేజ్) ముందు ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి మొహంజాహీ మార్కెట్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

* హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కాంగ్రెస్ విష ప్రచారానికి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.

* త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది.

* ఈ దేశాన్ని అస్థిరపరిచే శత్రువుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది.

డంపింగ్ యార్డు మీద :

* పని లేక నేను పాదయాత్ర చేసినట్లయితే రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడిండు ? ఎన్జీటీలో కేసు ఎందుకు వేశారు ?

* డంపింగ్ యార్డు వల్ల అనేకమంది చనిపోతున్నారు.

* డంప్ యార్డ్ ఎత్తివేసే వరకు ఈ పోరాటం ఆగదు.

ఫాక్స్ సాగర్ వద్ద హైడ్రా దేవాలయాల కూల్చివేస్తోంది అనే ప్రశ్నకు సమాధానంగా :

* హిందువులపై గుడ్డి ద్వేషంతో హైడ్రా దేవాలయాలు కూలుస్తుంది.

* హానర్ హోమ్స్ తో రేవంత్ లాలూచీ పడ్డారు.

* మల్కాజిగిరి పార్లమెంట్ మినీ ఇండియా. అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ ఉన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజల విశ్వాసాలతో దేవాలయాలు నిర్మాణం చేసుకున్నారు.

* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఫాక్స్ సాగర్ కట్ట కింద 18 దేవాలయాలున్నాయి.

* హైడ్రా.. ఈ సాగర్ లోకి మురుగునీరు రాకుండా చేస్తే సంతోషం. కానీ హిందూ విశ్వాసాల మీద గుడ్డి ద్వేషంతో కూలగొడుతున్నారు.

* ఈ హైడ్రా పెద్దవాళ్ళను వదిలిపెట్టి పేదల మీద పడుతుంది. అమాయకుల మీద, దిక్కులేని వారి మీద ప్రతాపం చూపిస్తున్నారు.

* వంద చూపిస్తా దమ్ముంటే వాటిని కూలగొట్టు.

* ఎల్లమ్మ బండ, షాంషీగూడ వంద ఎకరాల స్థలం ప్రభుత్వం దొంగలతో కోల్యూడ్ అయ్యి కోర్టుల్లో తీర్పులు వారికి అనుకూలంగా వచ్చేలా చేస్తే ఆ కబ్జా దారులు శ్మశాన వాటికలు కూడా కులిస్తుంటే అడగడం లేదు.

* ఐడీఎల్ లో 800 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ పేరు మీద ఉంది.

* వెయ్యి కోట్లు కేసీఆర్ కి ఇచ్చారు.

* హైడ్రా కి దమ్ముంటే వాటిని కూలగొట్టు.

* హానర్ హోమ్స్ ఒక్క విల్లా 26 కోట్లకు అమ్ముతున్నారు.

* 15 వేల కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టారు.

* దమ్ముంటే ఆ భూమి కాపాడి పిల్లల ఫీజులు చెల్లించు.

* ఈ భూమి మీద కోట్లాడిన నువ్వు ఇంకో 100 ఎకరాలు ఎలా ఇచ్చావు సమాధానం ఉందా ?

* ఇది లాలూచీ కాదా?

* హైడ్రా సుద్దపూస అనుకుంటున్నారు. కానీ మీ దగ్గర జరుగుతున్న అవినీతి అంత బయటికి వస్తుంది.

* చెరువులు కాపాడు.. కానీ ఆ పేరుతో దేవాలయాలు, పేదల ఇళ్లు కూలగొట్టవద్దు.

* ప్రజల ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వం బాధ్యత.

ఈ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు డి.గిరివర్దన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి తాడురి శ్రీనివాస్ రావు, రాష్ట్ర నాయకులు డా. ఎస్ మల్లారెడ్డి, జిల్లా OBC మోర్చ అధ్యక్షులు జేకే శేఖర్ యాదవ్, జిల్లా యువ మోర్చ అధ్యక్షులు శ్రీనాథ్, సీనియర్ నాయకులు వీకే మహేష్,గరిగె శేఖర్ ముదిరాజ్,సౌరబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR