Serilingampally: నేతాజీ నగర్‌లో రెండో రోజు కొనసాగిన రాగం హరి శంకర్ యాదవ్ పర్యటన!

Serilingampally: శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల డివిజన్ నేతాజీ నగర్‌లో సీనియర్ బీఆర్ఎస్ నేత రాగం హరి శంకర్ యాదవ్ రెండో రోజు డోర్-టు-డోర్ కార్యక్రమం నిర్వహించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 23 Nov 2026 5:54 PM IST
Serilingampally
X

Serilingampally: నేతాజీ నగర్‌లో రెండో రోజు కొనసాగిన రాగం హరి శంకర్ యాదవ్ పర్యటన!

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల డివిజన్ పరిధి నేతాజీ నగర్‌లో స్థానిక ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగం హరి శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో రెండో రోజు డోర్-టు-డోర్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులను నేరుగా కలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాగం హరి శంకర్ యాదవ్ గారు మాట్లాడుతూ, ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారితో చర్చించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అన్నదొర, నర్సింహా, ఆశ, కిషోర్, రాణి, రాజేశ్వరి, గణేష్, పి. శ్రీను, పి. బుగ్గయ్య, పి. మహేష్, శ్రీకాంత్, సాయి, విలాస్, గంగారాం, పి. బాలు, పి. రాజు, కే. శంకర్, కే. లక్ష్మణ్, కే. వెంకటేష్, కే. పోచయ్య, కే. రాములు, పి. పరుశురాం, ఎం. నాని, కే. బుచ్చయ్య, కే. మహేష్, జంగిలి, పి. జంపన్న, కే. వెంకన్న, కే. శ్రీను తదితర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY