Kadthal: హస్లీ యాడి అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ. 25 వేల విరాళం!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చిన వేముల బై తండాలో 'హస్లీ యాడి' ఆలయ నిర్మాణానికి మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ రూ. 25,000 విరాళం అందజేశారు.
Kadthal: హస్లీ యాడి అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ. 25 వేల విరాళం!
Kadthal: కడ్తాల్ మండల పరిధిలోని పెద్ద వేములోని బాయ్ తండ గ్రామపంచాయతీ పరిధిలో గల చిన వేముల బై తండాలో అత్యంత భక్తిశ్రద్ధలతో,ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన గిరిజనుల ఆరాధ్యదైవం 'హస్లీ యాడి' దేవాలయ నిర్మాణానికి కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఆలయ నిర్మాణ పనుల నిమిత్తం రూ. 25,000 (ఇరవై ఐదు వేల రూపాయలు) నగదును తన చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
తండా ప్రజల కలల రూపమైన ఈ ఆలయ నిర్మాణానికి ట్రస్ట్ అందించిన ఈ సాయం పనులకు మరింత ఊపునిచ్చింది.ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ భక్తిభావంతో మాట్లాడుతూ.. గిరిజన తండాల ఆచార వ్యవహారాలకు, తరతరాల సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి హస్లీ యాడి.
అమ్మవారి కృపాకటాక్షాలు తండా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని సమాజంలో శాంతి సౌఖ్యాలు ,ఐక్యతను పెంపొందించేందుకు ఇలాంటి పవిత్ర దేవాలయాల నిర్మాణాలు ఎంత గానోతోడ్పడతాయని పేర్కొన్నారు.రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా, ధార్మిక కార్యక్రమాలను బాధ్యతగా నిర్వహిస్తున్నామని,భవిష్యత్తులోనూ అమ్మవారి ఆలయ పురోగతికి, తండాల అభివృద్ధికి తమ వంతు సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఆలయ పనులను భక్తులందరూ కలిసికట్టుగా, నాణ్యతతో, అత్యంత వైభవంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.తమ తండాలో ఎంతో భక్తిశ్రద్ధలతో చేపట్టిన హస్లీ యాడి దేవాలయ నిర్మాణానికి పిలవగానే స్పందించి, అమ్మవారి కార్యానికి ఉదారంగా భారీ ఆర్థిక సాయాన్ని అందించిన ట్రస్ట్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ గారికి ఆలయ నిర్మాణ కమిటీ ప్రతినిధులు, తండా పెద్దలు, గిరిజన మహిళలు చేతులు జోడించి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ నాయక్ దశరథ్ నాయక్ పాండు నాయక్ శీను రమేష్ ఆలయ కమిటీ ప్రతినిధులు, తండా పెద్దలు, యువకులు, మహిళలు భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




