Quthbullapur: సుచిత్ర సినీ ప్లానెట్‌లో 'ది ప్యారడైజ్' సినిమా ప్రదర్శన నిలిపివేత

Quthbullapur: కుత్బుల్లాపూర్ సినీ ప్లానెట్‌లో 'ది ప్యారడైజ్' మూవీ ప్రదర్శన నిలిపివేత. మైనర్ల ప్రవేశంపై పోలీసుల తనిఖీలు, తల్లిదండ్రులతో వాగ్వాదం.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 24 Sept 2026 10:26 PM IST
Quthbullapur
X

Quthbullapur: సుచిత్ర సినీ ప్లానెట్‌లో 'ది ప్యారడైజ్' సినిమా ప్రదర్శన నిలిపివేత

కుత్బుల్లాపూర్: సుచిత్ర సర్కిల్ సమీపంలోని టీఎన్ఆర్ (సినీ ప్లానెట్) మల్టీప్లెక్స్‌లో గురువారం రాత్రి తీవ్ర గందరగోళం నెలకొంది. స్క్రీన్ 4లో ప్రదర్శించవలసిన ‘ది ప్యారడైజ్’ చిత్ర ప్రదర్శన అర్ధాంతరంగా మధ్యలోనే నిలిచిపోయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికేట్ జారీ చేయడంతో నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు వారికి ప్రవేశం లేదు.

అయితే, థియేటర్ లోపలికి మైనర్లు సినిమా చూస్తున్నారా అన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్క్రీన్ 4 లోపల కూర్చున్న 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను పోలీసులు బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో పిల్లలతో కలిసి వచ్చిన తల్లిదండ్రులు పోలీసుల చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

టికెట్లు జారీ చేసినప్పుడు నిబంధనలు ఎందుకు అమలు చేయలేదని, ఇప్పుడు హాల్ లోపలికి వచ్చిన తర్వాత ఇలా బయటకు పంపించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

నిలిచిపోయిన ప్రదర్శన..

సాయంత్రం 7:30 గంటలకే ప్రారంభం కావాల్సిన షో.. ఈ గొడవ, తనిఖీల కారణంగా దాదాపు గంటకు పైగా ఆలస్యమై నిలిచిపోయింది. దీంతో థియేటర్ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, మల్టీప్లెక్స్ సిబ్బంది ప్రేక్షకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR