Quthbullapur: హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి: శ్రీశైలం గౌడ్!
Quthbullapur: హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగులకు పదేళ్లుగా పెండింగ్లో ఉన్న పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు.
Quthbullapur: హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి: శ్రీశైలం గౌడ్!
Quthbullapur: హెచ్.ఎం.టీ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఎంటీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హెచ్ఎంటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు,కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక బిజెపి నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి, పార్లమెంట్లో ప్రస్తావించి ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా హెచ్ఎంటీకి చెందిన భూములు అన్యాక్రాంతమవుతూ, కబ్జాలకు గురవుతున్నాయని, సంస్థ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత హెచ్ఎంటీ యాజమాన్యంపై ఉందని గుర్తు చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ సభ్యులు జీవి నారాయణ రెడ్డి, రాములు,మధు కృష్ణ, రవీందర్ , యాదగిరి, కుమార స్వామి, మహేందర్, మాల్యాద్రి మరియు ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




