Quthbullapur: కుత్బుల్లాపూర్లో ₹25 వేల విలువైన డిఫెన్స్ లిక్కర్ పట్టివేత!
Quthbullapur: కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పరిధిలో రూ.25 వేల డిఫెన్స్ లిక్కర్ పట్టివేత. సైనికపురిలో కొని తెచ్చిన వ్యక్తి అరెస్ట్. చట్టరీత్యా నేరమని CI లక్ష్మణ్ గౌడ్ స్పష్టీకరణ.
Quthbullapur: కుత్బుల్లాపూర్లో ₹25 వేల విలువైన డిఫెన్స్ లిక్కర్ పట్టివేత!
కుత్బుల్లాపూర్: ఈరోజు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ పోలీసులు వెన్నెలగడ్డ చెరువు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా సుంకం చెల్లించని మద్యం ( డిఫెన్స్ లిక్కర్) రవాణా చేస్తున్న వ్యక్తి శ్రీ ఇమ్మడి.నవీన్ S/o బొందయ్య, (33) హస్మత్పేట్, బోయిన్ పల్లి వద్ద (9) మద్యం సీసాలు ఒక్కొక్కటి 750ml లభించాయి.
అందులో (5) బ్లాక్ డాగ్ బాటిల్స్, (4) 100 పేపర్స్ బాటిల్స్ మొత్తం (6.750 లీటర్ల డిఫెన్స్ లిక్కర్)ఉన్నట్లుగా గుర్తించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ టి.లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.
సదరు వ్యక్తినీ పూర్తిగా విచారించగా అతడు సైనికపురి దగ్గర ఒక డిఫెన్స్ ఉద్యోగి వద్ద కొని ఇక్కడ అమ్మడానికి తీసుకొనివచ్చి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడని ఈ సుంకం చెల్లించని డిఫెన్స్ లిక్కర్ విలువ సుమారుగా ₹ 25వేలు ఉంటుందని తెలిపారు. ఆ డిఫెన్స్ అధికారి కొరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ దాడులలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పి.ఉమా మహేశ్వర్, సిబ్బంది గౌస్, కిషన్, రమేష్, శివ ప్రసాద్, సురేష్,విజయలక్ష్మి పాల్గొన్నారు. సిబ్బందిని అభినందించారు.
కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో చాలా మిలిటరీ క్యాంటీన్ లు ఉన్నాయని తెలియక శుభకార్యాల కోసం ప్రజలు వారి వద్ద తక్కువ ధరకు కొని అమ్ముకోవడం, రవాణా చేయడం చట్టరీత్య నేరమని తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం కలిగి ఉన్నా రవాణా చేసినా ఇతరులకు అమ్మినా చట్ట పరంగా శిక్షింపబడతారని తెలుపుతూ వెంటనే సంబంధిత ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.




