Quthbullapur: కేటీఆర్‌ను కలసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నేతలు!
Quthbullapur: విజయదశమి సందర్భంగా హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేతలు.
Quthbullapur: కేటీఆర్‌ను కలసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నేతలు!
Quthbullapur: దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ లో రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో కలిశారు. కేటీఆర్ ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. విజయదశమి ప్రజల జీవితాల్లో సుఖసం తోషాలు, ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని వారికి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎల్లప్పుడూ ప్రజలకు అందు బాటులో ఉంటూ.. వారి సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులోనూ ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు రాబోయే రోజుల్లో ప్రజాసేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ యువజన విభాగం అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.




